రండి ‘ఇన్‌స్పైర్‌’ చేద్దాం | - | Sakshi
Sakshi News home page

రండి ‘ఇన్‌స్పైర్‌’ చేద్దాం

Jul 15 2026 12:11 AM | Updated on Jul 15 2026 12:11 AM

భవిష్యత్‌ శాస్త్రవేత్తలకు కేరాఫ్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌

నేటినుంచి ఆన్‌లైన్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

6 నుంచి పదో తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం

ప్రతీపాఠశాల నుంచి ఐదు వినూత్న ఆలోచనలకు నామినేషన్‌

సెప్టెంబర్‌ 15వరకు దరఖాస్తుల దాఖలుకు గడువు

ఆరు నుంచి పదో తరగతి వరకు అవకాశం

ఇన్‌స్పైర్‌ మనక్‌ 2026–27లో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ స్వీయ ఆలోచనలతో రూపొందించిన సాంకేతిక ఆవిష్కరణలను సమర్పించవచ్చు. యంత్రాలు, పరికరాలు, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, విద్య, రవాణా, ఇంధన పొదుపు, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ వంటి ప్రజల దైనందిన జీవితానికి ఉపయోగపడే ఏ రంగానికై నా సంబంధించిన కొత్త ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా నామినేట్‌ చేసుకునే అవకాశముంది.

పాఠశాల నుంచి 5 ప్రదర్శనలు

ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా ఐదు వినూత్న ఆలోచనలను ఎంపిక చేసి అధికారిక వెబ్‌ పోర్టల్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా సమర్పించవచ్చు. జూలై 15 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు నామినేషన్లు చేసుకునేందుకు వీలుంటుంది. ఎంపికై న ప్రతి విద్యార్థి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు ప్రోత్సాహక నగదును నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థులు తమ నమూనాలను అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు.

జిల్లా సాయి నుంచి జపాన్‌ సకూర వరకు

ఇన్‌స్పైర్‌ మనక్‌ ఎంపిక ప్రక్రియ పలు దశల్లో కొనసాగుతుంది. జిల్లాస్థాయిలో ఎంపికై న ప్రదర్శనల్లో 10 శాతం రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి మరో 10శాతం జాతీయస్థాయి ప్రదర్శనలకు ఎంపికవుతాయి. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్‌–60 ఆవిష్కరణలకు రాష్ట్రపతితో ప్రత్యేక సమావేశంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికయ్యే టాప్‌–5 వినూత్న ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జపాన్‌ సకురా సైన్స్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌కు పంపిస్తారు.

ఎలాంటి ప్రదర్శనలు

సమాజంలో లేదా దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు సాంకేతిక పరిష్కారం చూపే కొత్త ఆలోచనలై ఉండాలి. ఇంటర్నెట్‌ లేదా యూట్యూబ్‌ చూసి కాపీ కొట్టిన పాత మోడల్స్‌ కాకుండా, సొంతంగా ఆలోచించిన సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

2025– 26లో ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలు

ఉమ్మడి జిల్లాలో 2025–26 సంవత్సరానికి గాను 360 ప్రదర్శనలు ఎంపికయ్యాయి. జగిత్యాల నుంచి 123, కరీంనగర్‌ నుంచి 112, రాజన్న సిరిసిల్ల 67, పెద్దపల్లిలో 60 నమూనలు ఎంపికయ్యాయి. త్వరలో ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన ప్రాంతంలో జిల్లాస్థాయిలో ఇన్‌స్పైర్‌ మనాక్‌ ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి.

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): నేటి పోటీ ప్రపంచంలో పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలు, సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం విద్యార్థులకు ఎంతో అవసరం. అలాంటి ఆవిష్కరణాత్మక భావాలను వెలికితీసి, జాతీయస్థాయిలో గుర్తింపు కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ మనక్‌ 2026–27 కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement