● నాలుగు టిప్పర్‌లు సీజ్
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని వివిధ ప్రాంతాల్లోంచి అధిక లోడ్‌తో మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో మంగళవారం రవాణాశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందంలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ హరిత యాదవ్, రియాజ్ పట్టుకున్నారు. ఓవర్ లోడ్‌తో రోడ్లపై వెళ్తున్న వాహనాల నియంత్రణ కోసం దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అధికలోడ్‌తో మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టుకుని కేసు నమోదు చేసి సీజ్ చేశామన్నారు. ఏఎంవీఐ హరిత యాదవ్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫిట్‌నెస్‌పై పాఠశాలల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.


