కరీంనగర్‌క్రైం: కేసుల దర్యాప్తులో అలసత్వాన్ని సహించేది లేదని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశా రు. కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 2026 తొలి అర్ధవార్షిక నేరాల సమీక్షలో 2025, 2026 తొలి ఆరు నెలల నేరాల గణాంకాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిర్దేశిత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే నేరగాళ్లతో కఠినంగా వ్యవహరించాలన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్‌కుమార్, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్ జి.వేణుగోపాల్ పాల్గొన్నారు.
పలువురు పోలీసులకు రివార్డు
పీఎంజే జువెల్లరీ చోరీ కేసును ఛేదించి, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్, కరీంనగర్ టూ టౌన్ సీఐ సృజన్‌రెడ్డితో పాటు పలువురికి సీపీ గౌస్ ఆలం రివార్డులు అందించారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమి షనర్ ప్రఫుల్‌దేశాయ్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను సోమవారం నగరంలోని కోతిరాంపూర్, కాపువాడ, ఆదర్శనగర్, వావిలాలపల్లి తదితర ప్రాంతాలలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడం, ఆన్‌లైన్ పోర్టల్ నమోదు చేయడంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వరాదని బీఎల్‌వోలకు సూచించారు. ప్రతి రోజు ఒక్కో బీఎల్‌వో 200 ఎన్యుమరేషన్ ఫారాలను ఆన్‌లైన్‌లో చేయాలన్నారు. కార్పొరేటర్‌లు వైద్యుల అంజన్‌కుమార్, సాదవేని సుజాత శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం కరీంనగర్‌లోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, దివంగత కానిస్టేబుల్ కిష్టయ్య నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిష్టయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. కిష్టయ్య కూతురు ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యాభ్యాసం ఫీజు చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ ఉన్నారు.
కొత్తపల్లి: 132/33 కె.వీ.వావిలాలపల్లి విద్యుత్‌స్టేషన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంతోష్‌నగర్, భాగ్యనగర్, మహాశక్తి ఆలయం, జ్యోతినగర్, గీతాభవన్ వెనక ప్రాంతం, సెయింట్ జాన్స్ స్కూల్, విద్యానగర్, శ్రీరాంనగర్ కాలనీ, కొత్తయాస్వాడ, విజయదుర్గకాలనీ, చైతన్యపురి, 11 కె.వీ.పీటిసీ ఫీడర్ పరిధిలోని పిటిసీ, బుల్ స్టేషన్, శ్రీహరినగర్, సంతోష్‌నగర్, కుర్మవాడ, రాంనగర్ ప్రాంతా ల్లో విద్యుత్ నిలిపివేయన్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని రామచంద్రాపూర్, సప్తగిరికాలనీ, సాయిబాబా, అంజనాద్రి ఆల యం, శ్రీనగర్‌కాలనీ, ఏవోస్ కాలనీ, పొన్నం కనకయ్య హోటల్, వెంకటాద్రికాలనీ, మల్లికా ర్జునకాలనీ, జానకీరాంకాలనీ, 33/11 కె.వీ. బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2, 1 ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలో
132 కె.వీ.వావిలాలపల్లి సబ్ స్టేషన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 32/11 కె.వీ.రేకుర్తి సబ్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి, కంటి ఆసుపత్రి, ఇందిరమ్మకాలనీ, స్వామికాలనీ, షేకాబ్‌కాలనీ, సీతారాంపూర్, జగిత్యాల రోడ్డు, ఆర్టీసీకాలనీ, గౌడ్స్ కాలనీ, సమ్మక్క గద్దెలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు.


