అర్జీలు ఆలస్యం చేయకండమ్మా | - | Sakshi
Sakshi News home page

అర్జీలు ఆలస్యం చేయకండమ్మా

Jul 14 2026 12:06 AM | Updated on Jul 14 2026 12:06 AM

● ప్రజావాణిలో బాధితుల ఏకరవు ● పరిష్కరించాలని వేడుకోలు

కరీంనగర్‌ అర్బన్‌: ‘అమ్మా.. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అధికారులు కావాలని ఆలస్యం చేస్తున్నారు. మా సమస్యను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పలువురు బాధితులు వాపోయా రు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి అధిక సంఖ్యలో ప్రజలు రాగా తమ అర్జీలను కలెక్టర్‌ చిత్రామిశ్రాకు అందజేశారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో స్వామి, ఆర్డీవో షర్మిల అర్జీలు స్వీకరించారు. మొత్తం 255 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో వివరించారు.

మొత్తం అర్జీలు: 255, హౌజింగ్‌: 59

ఆర్డీవో, కరీంనగర్‌: 57

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 50

ఆర్డీవో, హుజూరాబాద్‌: 28

టీజీఎన్‌పీడీసీఎల్‌: 10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement