ఎకో ఫ్రెండ్లీ బిజినెస్‌ | - | Sakshi
Sakshi News home page

ఎకో ఫ్రెండ్లీ బిజినెస్‌

Jul 12 2026 3:17 AM | Updated on Jul 12 2026 3:17 AM

ఎకో ఫ్రెండ్లీ బిజినెస్‌ ఎనిమిదేళ్లుగా వ్యాపారం

ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బతింటోందని ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించింది. చిరు వ్యాపారులకు పర్యావరణ హితమైన నాన్‌ ఓవెన్‌, జ్యూట్‌ (జనపనార),పేపర్‌ బ్యాగుల తయారీ ఒక అద్భుతమైన ఉపాధి మార్గంగా మారింది. పుష్కరకాలం క్రితం సిరిసిల్లను ప్లాస్టిక్‌ నిషేధ పట్టణంగా మున్సిపాలిటీ ప్రకటించింది. ఫలితంగా చిరు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, నిరుద్యోగులు కుటీర పరిశ్రమగా ఆయా ఉత్పత్తుల తయారీ వ్యాపారాలను ఎంచుకుని ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. నాన్‌ ఓవెన్‌ బ్యాగులను అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారు. సూపర్‌ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, బట్టల షాపులు, స్వీట్‌ స్టాల్స్‌లో వీటిని వినియోగిస్తున్నారు. జ్యూట్‌ (జనపనార)తో తయారయ్యే బ్యాగులు చాలాకాలం మన్నుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల రిటర్న్‌ గిఫ్ట్‌లు, లంచ్‌ బ్యాగులు, షాపింగ్‌ మాల్స్‌లో వాడుతున్నారు. ఇక పేపర్‌ బ్యాగులను బేకరీలు, మెడికల్‌ షాపులు, ఫ్యాషన్‌ బ్రాండ్లలో ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా అందిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఇంట్లోనే తయారి విక్రయాలతో చిరు వ్యాపారులు ఈ బిజినెస్‌ను ఎంచుకున్నారు. తయారు చేసిన బ్యాగులపై వ్యాపార సంస్థల పేర్లు, లోగోలను ప్రింట్‌ చేస్తూ..కస్టమర్ల నుంచి ఆర్డర్లు పొందుతున్నారు.

ప్లాస్టిక్‌ నిషేధం నేపథ్యంలో జూట్‌ బ్యా గుల వ్యాపారాన్ని ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నాం. పశ్చిమ బెంగాల్‌ నుంచి జ్యూట్‌ బ్యాగులను తెప్పిస్తున్నాం. రూ.40 నుంచి రూ.500 వి లువైన బ్యాగులున్నాయి.పెళ్లిళ్లు, శుభకార్యాలకు, గిఫ్ట్‌లకు, షాపింగ్‌కు మహిళల హ్యాండ్‌బ్యాగులు విక్రయిస్తున్నాం. కళా త్మక డిజైన్లతో బ్యాగులను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. ఇవి చాలాకాలం మన్నికతో ఉండటంతోపాటు నూరుశాతం ప ర్యావరణ హితంగా ఉంటాయి. ఆర్డర్లను బట్టి బల్క్‌లో తె ప్పించి స్టాక్‌ను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా కస్టమర్లకు అందిస్తాం.

– తిరునగరి శ్రీలత, జ్యూట్‌ బ్యాగుల వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement