కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లావ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందని డీవైఎస్‌వో వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూల్ డౌన్ ఎక్సర్‌సైజ్ గురించి వివరించారు. ఫిజి యోథెరపిస్ట్ కృష్ణ ప్రసాద్, ఫుట్‌బాల్ కోచ్ రహీం, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు అంతటి శంకరయ్య, ఆడేపు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి బి.వేణుగోపాల్ పాల్గొన్నారు.


