3.. 16.. 17.. 23 | - | Sakshi
Sakshi News home page

3.. 16.. 17.. 23

Jul 11 2026 1:06 AM | Updated on Jul 11 2026 1:06 AM

‘ప్రచేష్ట–గ్రేడింగ్‌’లో మెరిసిన మన జిల్లాలు

రాష్ట్రంలో మూడో స్థానంలో పెద్దపల్లి

తరువాత సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల

వసతులు, డిజిటల్‌ విద్య, డ్రాపౌట్‌ నియంత్రణలో పురోగతి

పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌– 2.o నివేదికలో వెల్లడి

‘ప్రచేష్ట–గ్రేడింగ్‌’లో మెరిసిన మన జిల్లాలు

సాక్షి,పెద్దపల్లి: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌– 2.o (2024–25) నివేదికలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మెరుగైన పనితీరు కనబరిచింది. పాఠశాల విద్యా వ్యవస్థ నాణ్యత, అభ్యసన ఫలితాలు, వసతులు, డిజిటల్‌ లెర్నింగ్‌, సమాన విద్యావకాశాలు, పరిపాలన వంటి ఆరు కీలక డొమైన్ల ఆధారంగా నిర్వహించిన ఈ అంచనాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. 600 మార్కులకు 51 శాతం నుంచి 60 శాతం వరకు స్కోరు సాధించిన జిల్లాలను ‘ప్రచేష్ట–1’ గ్రేడింగ్‌ పరిధిలోకి చేరుస్తారు. 324 స్కోర్‌తో పెద్దపల్లి ప్రచేష్ట–1 గ్రేడింగ్‌లో చేరింది. 41 శాతం నుంచి 50 శాతం స్కోర్‌ సాధించిన సిరిసిల్ల,

కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలు ప్రచేష్ట–2

గ్రేడింగ్‌లో చోటు సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement