కరీంనగర్‌సిటీ: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామంలో రూ.29 కోట్లతో నిర్మించే శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాల శాశ్వత భవనాలకు శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి వివేక్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల తొలి విద్యా సంవత్సరం విజయవంతంగా పూర్తిచేసుకుని, రెండో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యున్న త ప్రమాణాల సాంకేతిక విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక హాస్టల్ భవనాల నిర్మాణానికి విశ్వవిద్యాలయ పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్ల డించారు. త్వరలోనే హాస్టల్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. విద్యార్థులకు లాప్ టాప్‌లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఎస్‌యూ వీసీ ఉమేశ్ కుమార్, రిజిస్ట్రార్ సతీశ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ ఓటుహక్కు ఉండాలి
చిగురుమామిడి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటుహక్కు కల్పించే బాధ్యత బీఆర్‌ఎస్ బీఎల్‌ఏలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ సూచించా రు. చిగురుమామిడిలో శుక్రవారం బీఎల్‌ఏలతో అవగాహన సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్‌ఎస్ నాయకులు అన్ని గ్రామాల్లో ఓటరు సవరణ ఫారాలను పూర్తి వివరాలతో పొందుపర్చి ఓటర్లకు సహకరించాలన్నారు. జూలై 24 వరకు గడువు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా జాబితా ఫారాల ను బీఎల్‌వోలకు అందజేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు మాట్లాడుతూ దొంగ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నాయకులపై ఉందన్నారు. నాయకులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మామిడి అంజయ్య, ఆకవరం శివప్రసాద్ పాల్గొన్నారు.
రూరల్ సబ్ డివిజన్‌లో


