ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లావ్యాప్తంగా 173 మీసేవ కేంద్రాల ద్వారా శుక్రవారం నుంచి బుకింగ్ ప్రారంభమైంది. రైతులు మీ సేవ కేంద్రంలో పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నంబర్, ఎన్ని బస్తాలు అవసరం, ఎరువులదుకాణం వివరాలు నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. అనంతరం ఎక్కడి దుకాణంలో యూరియా లభిస్తుందో ఐడీ నంబర్ వస్తుంది. రెండు రోజుల్లోగా సంబంధిత దుకాణం నుంచి యూరియా తీసుకెళ్లొచ్చు. ఇందుకు మీసేవ నిర్వాహకులు యూజర్ చార్జీల కింద రూ.10 తీసుకుంటున్నారు. – కరీంనగర్‌రూరల్


