బ్రేక్‌కు అడ్డుపడిన టిఫిన్‌ బాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

బ్రేక్‌కు అడ్డుపడిన టిఫిన్‌ బాక్స్‌

Jul 10 2026 7:22 AM | Updated on Jul 10 2026 7:22 AM

కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): టిఫిన్‌ బాక్స్‌ బ్రేక్‌కు అడ్డుపడి అదుపుతప్పిన ప్రైవేటు స్కూల్‌ బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన గురువారం కాల్వశ్రీరాంపూర్‌ మండలం మంగపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెగడపల్లిలోని ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం మంగపేట, తెనుగుపల్లె, కూనారం గ్రామాలకు చెందిన సుమారు 40 మంది విద్యార్థులను బస్సులో తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురయింది. విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. స్కూల్‌ బ్యాగు నుంచి టిఫిన్‌ బాక్స్‌ జారిపడి బ్రేక్‌కు అడ్డు వచ్చిందని డ్రైవర్‌ పేర్కొన్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ఈఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఫైనాన్స్‌లో కొత్తబస్సులు కొనుగోలు చేశామని, దేవుడి దయతో విద్యార్థులు, డ్రైవర్‌ క్షేమంగా బయటపడటం అదృష్టంగా భావిస్తున్నట్లు స్కూల్‌ కరస్పాండెంట్‌ పేర్కొన్నారు.

అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్‌ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement