ప్రాణం మీదకు తెచ్చిన వేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన వేగం

Jul 9 2026 6:59 AM | Updated on Jul 9 2026 6:59 AM

సిరిసిల్లటౌన్‌: అతివేగం ప్రాణం మీదకు తెచ్చింది. కారు అతివేగంగా కల్వర్టును ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌కు చెందిన జి.రాంగోపాల్‌రావు మత్య్సశాఖలో రిటైర్డ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌. అదే గ్రామానికి చెందిన గన్నె మల్లయ్యతో కలిసి కరీంనగర్‌కు కారులో వెళ్తున్నారు. కొత్తచెరువు శివారులోని కల్వర్టును 85 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టాడు. బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా రాంగోపాల్‌రావు తలకు, మల్లయ్య కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది శ్రీనివాస్‌, అనిల్‌ క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

కల్వర్టును ఢీకొట్టిన కారు

ఇద్దరి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement