ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల హవా
ఫస్టియర్‌లో 70.17 శాతం.. సెకండియర్‌లో 80.04 శాతం ఉత్తీర్ణత నమోదు వరుసగా రెండో ఏడాది ఏడోస్థానంలో జిల్లా రాణించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు
కరీంనగర్
7
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కరీంనగర్‌టౌన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. ఈ ఏడాది కూడా భళా అనిపించుకున్నారు. ఫస్టియర్, సెకండియర్‌లో అన్ని కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మెరిశారు. ప్రథమ సంవత్సరంలో 70.17, ద్వితీయ సంవత్సరంలో 80.04శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వరుసగా రెండో ఏడాది రాష్ట్రస్థాయిలో జిల్లా ఏడోస్థానంలో నిలిచింది. ప్రభుత్వ క ళాశాలల విద్యార్థులు అత్యధిక మార్కులతో మెరి శారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సత్తా చాటా రు. ప్రథమ సంవత్సరంలో పలువురు విద్యార్థులు ఎంపీసీలో 470 మార్కులకు 469, బైపీసీలో 440కి 439 మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. విద్యార్థులను ఆయా కళాశాలల అధ్యా పకులు అభినందించారు.
జిల్లాకు ఏడోస్థానం
2024– 25 విద్యాసంవత్సరంలో రాష్ట్రస్థాయిలో ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఏడోస్థానంలో నిలవగా.. 2025–26లోనూ ఏడోస్థానాన్ని దక్కించుకుంది. ఫస్టియర్‌లో 6వ ర్యాంకు దక్కింది. ఒకేషనల్ ద్వి తీయ సంవత్సరంలో జిల్లా 30 స్థానంలో, ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. 2025–26లో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 14,943 మంది హాజరుకాగా 11,961 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి లో 6,347మంది బాలికలు, 5,614 మంది బాలురున్నారు. ప్రథమ సంవత్సరంలో 16,726 మంది పరీక్షలకు హాజరుకాగా, 11,737 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 6,051 మంది బాలికలు, 5,686 మంది బాలురున్నారు. ఒకేషనల్ ప్రథమ సంవత్స రం పరీక్షలకు 1,449 మంది హాజరుకాగా 822మంది ఉత్తీర్ణులయ్యారు. 56.73 శాతం ఉత్తీర్ణతను సా ధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,320 మంది హాజరుకాగా 876 మంది విద్యార్థులు ఉత్తీ ర్ణులయ్యారు. 66.36శాతం ఉత్తీర్ణత సాధించారు.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణతశాతం పెరిగింది. కరోనా అనంతరం నుంచి ఫలితాల్లో జిల్లా తొలిసారిగా 80శాతం మార్క్‌ను దాటింది. ఈసారి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా అత్యుత్తమ మార్కులు సాధించారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మహాత్మ జ్యోతి బాపూలే, సాంఘీక సంక్షేమ, మోడల్ స్కూల్, కేజీబీవీ కళాశాలల విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మార్కులు సొంతం చేసుకున్నారు. పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు రాణించారు. ఫస్టియర్‌లో 99శాతం మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మెరిశారు.
ఏడాది ఫస్టియర్ సెకండియర్
2025-26 70.17 80.04
2024-25 69.84 73
2023-24 63.41 73
2022-23 69 70
2021-22 69 70


