కరీంనగర్‌టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్)/తిమ్మాపూర్: ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతి బాపూలే కళాశాలల విద్యార్థులు సత్తా చాటారని ఆర్‌సీవో అంజలి కుమారి తెలిపారు. ఫస్టియర్‌లో 78.2శాతం, ద్వితీయ సంవత్సరంలో 88.4శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు వివరించారు. ఫస్టియర్ ఎంపీసీలో ఎల్‌ఎండీకాలనీ కళాశాలకు చెందిన సహస్ర 467 మార్కులు, బైపీసీలో త్రిప్తి 438, సీఈసీలో హుజూరాబాద్ కళాశాలకు చెందిన సాయివర్షిత 494 మార్కులతో సత్తా చాటినట్లు తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో ఎల్‌ఎండీకాలనీ కళాశాలకు చెందిన హరిణి 992, కరీంనగర్ కళాశాలకు చెందిన అనుష్క 992, బైపీసీలో శ్రుతి 992, సీఈసీలో పెగడపల్లి కళాశాలకు చెందిన శ్రీజ 967 మార్కులు సాధించినట్లు తెలిపారు.
సీవోఈ విద్యార్థుల ప్రతిభ
అలుగునూర్‌లోని సీవోఈ నుంచి మొదటి సంవత్సరం ఎంపీసీలో కె.అక్షిత 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. జి.నందిని, ఎల్.అక్షిత, ఎం.సుదీక్ష, ఎం.శైలజ, బీ.అవంతిక, కే.వినీల 467 మార్కులు, మరో 12 మంది 466మార్కులు, ఆరుగురు 465 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో కే.సౌమ్య 994 మార్కులు, బి.అక్షిత 993మార్కులు సాధించారు. బైపీసీలో జే.ప్రసన్న 988మార్కులు సాధించింది. వీరిని జోనల్ అధికారి ప్రత్యూష, ప్రిన్సిపాల్ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ ఆసియ సుల్తానా అభినందించారు.
రాణించిన కేజీబీవీ విద్యార్థుల
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ కళాశాలల విద్యార్థులు సత్తా చాటినట్లు జీసీడీవో కృపారాణి తెలిపారు. జిల్లాలోని 8 కళాశాలల నుంచి ఫస్టియర్‌లో 81 శాతం, సెకండియర్‌లో 83శాతం ఉత్తీర్ణత నమోదు చేసినట్లు తెలిపారు. కేజీబీవీ కళాశాలల పరిధిలో రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. శంకరపట్నం కళాశాలలో కె.శరణ్య బైపీసీ ద్వితీయ సంవత్సరంలో 971 మార్కులు, ఎంపీసీలో టి.స్వాతి 987, జమ్మికుంట కళాశాలలో ఎంపీసీ సెకండియర్‌లో చంద్రజ్యోతి 986 మార్కులు సాధించినట్లు తెలిపారు.
చంద్రజ్యోతి
శరణ్య
స్వాతి


