సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

కొత్తపల్లి: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క రు బాధ్యతగా వ్యవహరించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కరీంనగర్‌ విభాగ్‌ బౌద్ధి ప్రముఖ్‌ సామల కిరణ్‌ జి తెలిపారు. చింతకుంట ఉప మండలం (చింతకుంట, కమాన్‌ పూర్‌, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌, బద్దిపల్లి) హిందూ సమ్మేళనం శనివా రం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనాని కి ముఖ్య వక్తగా హాజరైన కిరణ్‌ జి మాట్లాడు తూ సమాజంలో కులాల పేరుతో విభజన పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నా రు. హిందూ సమాజంలో ఐక్యతను బలోపే తం చేయడమే లక్ష్యంగా సమ్మేళనాలు నిర్వహించడం జ రుగుతుందని అన్నారు. సామాజిక సమరత, కుటుంబ ప్రబోధన్‌, సంస్కృతి సాంప్రదాయాలు, పౌర నియమావళి, పర్యావరణం లాంటి ఐదు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నా రు. సభ అధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య, శ్రీ శ్రీ ముక్తానంద స్వామి జి, మంజుల పాల్గొనారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement