కరీంనగర్‌టౌన్/సప్తగిరికాలనీ(కరీంనగర్): ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్‌లోని కోట రేసోనెన్స్ విద్యార్థులు విజయదుందుభి మోగించారని కళాశాల చైర్మన్ డి.అంజిరెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో గాలి సౌమ్యశ్రీ 469, సాత్విక్, వేముల అఖిల, శ్రీ సహస్ర రెడ్డి 468 మార్కులు, బైపీసీలో పి.శరణ్య 438, ఎం.సిద్ధి 437 మార్కులు సాధించినట్లు తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో సహనసిరి 995 మార్కులు, బైపీసీలో జి.రోషిని 993, ఎం.శ్రీష 992 మార్కులు సాధించారన్నారు. వీరిని అంజిరెడ్డి అభినందించారు.


