ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

ఆలస్యంగా వెలుగులోకి..

పోలీసులు అదుపులో నిందితుడు

పోక్సో కేసు నమోదు

రామగుండం: వరుసకు కోడలైన ఓ మైనర్‌ బాలిక(8)పై లైంగికదాడికి యత్నించిన ఘటన రెండు రోజులు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎస్సై బోయ వెంకటస్వామి తెలిపిన వివరాలు. అంతర్గాం మండల పరిధిలోని అక్బర్‌నగర్‌కు చెందిన ఇలియాజ్‌(50) శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి సమీపంలోని వరుసకు సోదరి అయిన మహిళకు ఫోన్‌చేసి కోడలు(మైనర్‌ బాలిక)ను తమ ఇంటికి పంపించమని.. తన కూతురుతో ఆడుకుంటుందని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన సదరు మహిళ బాలికను వాళ్లింటికి పంపించింది. ఇలియాజ్‌ ఒక్కడే ఉండగా మైనర్‌ బాలికను ఇంట్లోకి పిలిచి లైంగికదాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన బాలిక వెంటనే తిరిగి ఇంటికెళ్లిపోయింది. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతూ భయం భయంగా ఉంటోంది. సదరు బాలిక తనకు జరిగిన ఘటన గురించి ఆదివారం తల్లికి చెప్పడంతో హతాశులయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు అంతర్గాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై వివిధ రకాల ఆరోపణలు రావడంతో మరింత లోతైన విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement