ప్రతీ పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకోవాలి
కరీంనగర్: ప్రతీ పట్టభద్రుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని యువ నాయకుడు జనార్దన్ అన్నారు. గురువారం ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆరెకటిక కుల పట్టుభద్రుల, విద్యావంతుల సమావేశంలో మాట్లాడారు. తాను ఆరెకటిక కులం నుంచి చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. సమాజసేవలో ముందుకు పోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అశీర్వదిస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం చూపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. యువత రాజకీయాలవైపు మొగ్గు చూపాలని సూచించారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు.పట్టభద్రులందరూ తనకు చేదోడు వాదోడుగా ఉండాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక పట్టభద్రులు పాల్గొన్నారు.


