‘బండి’ని గెలిపించాలి.. | - | Sakshi
Sakshi News home page

‘బండి’ని గెలిపించాలి..

May 4 2024 8:15 AM | Updated on May 4 2024 11:37 AM

-

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలంలోని బొమ్మకల్‌లో శుక్రవారం బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు.

నల్ల చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఎంపీగా సంజయ్‌ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దాది సుధాకర్‌, పాశం తిరుపతి, చిందం అశోక్‌, దాసరి రమణారెడ్డి, పుట్టపాక శ్రీధర్‌, పెద్ది లక్ష్మణ్‌, కాల్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

సంజయ్‌కి పలు బీసీ సంఘాల మద్దతు..
బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి శుక్రవారం పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడు తూ.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలందరూ ఏకమై, బీసీ అభ్యర్థి అయిన సంజయ్‌ని గెలి పించాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ మాత్రమే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని,

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొ ని, ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు కేశిపెద్ది శ్రీధర్‌ రాజు, ఎన్నం ప్రకా శ్‌, నాగుల కనకయ్య గౌడ్‌, నారోజు రాకేశ్‌చారి, దొగ్గలి శ్రీధర్‌, మియాపురం రవీంద్రాచారి, కాయితోజు బ్రహ్మచారి, రంగు సంపత్‌ గౌడ్‌, మాదాసు సంజీవ్‌, బోయిని ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement