బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్‌ అంటూ.. సెల్ఫీతో యువ‌కుడి విషాదం! | - | Sakshi
Sakshi News home page

బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్‌ అంటూ.. సెల్ఫీతో యువ‌కుడి విషాదం!

Jan 4 2024 12:48 AM | Updated on Jan 4 2024 7:33 AM

- - Sakshi

కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్‌లో సెల్‌ఫోన్‌ రిపేర్‌ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్‌ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్‌ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు.

ఆత్మహత్యపై అనుమానాలు..
ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బర్త్‌డేకు చిన్న గిఫ్ట్‌ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్‌ ఫెయిల్యూర్‌ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

పోలీసుల విచారణ..
ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: గ్యాంగ్‌స్టర్‌ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య

Advertisement
 
Advertisement
Advertisement