‘ఎల్‌ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి.. యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి.. యువకుడు..

Published Fri, Nov 3 2023 1:56 AM | Last Updated on Fri, Nov 3 2023 1:55 PM

- - Sakshi

సాక్షి, కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు మోయతుమ్మెద వాగు(ఎల్‌ఎండీ బ్యాక్‌ వాటర్‌)లో దూకిన ఘటన తిమ్మాపూర్‌ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటకు చెందిన సందెబోయిన అభిలాష్‌ అలియాస్‌ టింకు బుధవారం రాత్రి రేణికుంట శివారులోని రాజీవ్‌ రహదారి బ్రిడ్జి పైనుంచి ఎల్‌ఎండీ బ్యాక్‌ వాటర్‌లో దూకాడు.

అంతకుముందు తన ఫోన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్‌ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అభిలాష్‌ ఆచూకీ దొరకలేదని ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: 'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement