అమ్మ పరీక్షలు బాగా రాయాలని చెప్పేది | - | Sakshi
Sakshi News home page

అమ్మ పరీక్షలు బాగా రాయాలని చెప్పేది

May 12 2023 1:50 AM | Updated on May 12 2023 1:57 PM

- - Sakshi

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఏడేళ్ల క్రితం నాన్న చనిపోయాడు.. పదోతరగతి పరీక్షలకు నాలుగు రోజుల ముందే అమ్మ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. అమ్మానాన్నను కోల్పోయిన బాధను దిగమింగుకొని, పరీక్షలకు సిద్ధమయ్యాడు కరీంనగర్‌ అలకాపురి కాలనీకి చెందిన ప్రజ్ఞాంత్‌ రెడ్డి. గత బుధవారం విడుదలైన ఫలితాల్లో 9.5 జీపీఏ సాధించాడు. మార్చి 31న కరీంనగర్‌ పద్మనగర్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదంలో ఆ విద్యార్థి తల్లి రజిత మృతి చెందిన విషయం తెలిసిందే.

అతను నగరంలోని సిద్దార్థ పాఠశాలలో చదివాడు. అమ్మ బతికున్న రోజుల్లో పదోతరగతి పరీక్షలు బాగా రాయాలని చెప్పేదని, ఆ మాటలే నన్ను ప్రభావితం చేసి, 9.5 జీపీఏ తెచ్చుకునేందుకు కారణమయ్యాయని తెలిపాడు. తాను ఐఐటీలో చదవాలనేది అమ్మ కోరిక అని, అందులో సీటు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement