పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో ఈనెల 27న దొంగతనానికి పాల్పడ్డ కేసులో స్థానిక శాంతినగర్‌కు చెందిన మిర్యాల రంజిత్‌రెడ్డిని ఆదివారం పట్టుకున్నట్టు టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన రాయిని రమాదేవి, అర్జున్ దంపతులు పనినిమిత్తం మే 27న ఇంటికి తాళం వేసి సాయంత్రం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. బీరువా తలుపులు తెరచి 15 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని భూంనగర్‌లో అనుమానాస్పద రీతిలో తిరుగుతుండగా రంజిత్‌రెడ్డిని పట్టుకుని విచారించగా హనుమాన్‌నగర్‌లో దొంగతనం చేసినట్టు అంగీకరించాడని ఎస్సై వివరించారు.


