అదుపుతప్పిన బైక్‌.. యువకుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన బైక్‌.. యువకుడికి తీవ్ర గాయాలు

Aug 2 2026 11:55 PM | Updated on Aug 2 2026 11:55 PM

● తారురోడ్డు ఎక్కించే క్రమంలో ప్రమాదం

చందుర్తి(వేములవాడ): బైక్‌ అదుపుతప్పి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్‌–బండపల్లి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్‌ గ్రామానికి చెందిన పులి ప్రణయ్‌ ద్విచక్ర వాహనంపై బండపల్లికి వచ్చి వెళ్తుండగా మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి రోడ్డు దిగింది. సైడ్‌బర్‌మ్స్‌ లేకపోవడంతో తారు రోడ్డు ఎత్తుగా ఉంది. బైక్‌ను రోడ్డుపైకి ఎక్కిస్తుండగా అదుపుతప్పడంతో యువకుడు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. ఈ సంఘటనలో యువకుడి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లాడు. 108 అంబులెన్స్‌లో వేములవాడకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ రోడ్డుపై గత రెండు వారాల్లో రెండో ప్రమాదం. గత నెల 16న జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.

స్పృహ తప్పిన ఎన్గల్‌ యువకుడు ప్రణయ్‌

సంఘటన స్థలంలో పడి ఉన్న ద్విచక్రవాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement