కరీంనగర్‌స్పోర్ట్స్: భారత యోగా సమాఖ్య జాతీయ వివాద పరిష్కారాల ఉప కమిటీ సభ్యుడిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తెడ్డు మనోజ్‌కుమార్ ఆదివారం ఎంపికయ్యారు. గతంలో ఏషియన్, అంతర్జాతీయ యోగా పోటీల్లో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నియామకం పట్ల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, గుంటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, భారత యోగా సమాఖ్య ఉపాధ్యక్షుడు జే.మనోహర్ కుమార్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఐశ్వర్య, ప్రభాకర్‌రెడ్డి, కన్న కృష్ణ, కమలాకర్, బాలరాజు, సీహెచ్.గంగాధర్, కె.విజయ్ కుమార్, పి.శ్రీనివాస్, మతిన్, కే.రవీందర్, యు.రవీందర్, రాజు, నాగార్జున, పి.స్వరూప చారి అభినందనలు తెలిపారు.


