25వ రోజుకు చేరిన సమ్మె | - | Sakshi
Sakshi News home page

25వ రోజుకు చేరిన సమ్మె

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

25వ రోజుకు చేరిన సమ్మె

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చౌక్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కట్టెలతో అంపశయ్యను పేర్చి, దానిపై తమ న్యాయమైన డిమాండ్ల ప్రతులను పడుకోబెట్టి కన్నీటి నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు, వైద్య సిబ్బంది వెంకటరమణ, అశ్విని, వైద్యులు రాహుల్‌, వేణుమాధవ్‌, మారుతి, హరీశ్‌, శేఖర్‌, బాలు, రాజు, కవిత, నిర్మల, స్వాతి, శ్రావణి, సుకన్య, సుప్రియ, శ్రీకాంత్‌, రోషిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement