ఓటు హక్కుపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కుపై అవగాహన

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

ఓటు హక్కుపై అవగాహన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు బోనాల ఊరేగింపు ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ అసత్య ప్రచారం పైపుల ధ్వంసం ఉన్నత స్థాయికి ఎదగాలి

బాన్సువాడ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యకమం పై బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రేణుక ఒకేషనల్‌ కళాశాలలో శుక్రవారం బీజేవైఎం నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్‌ ప్రక్రియ, కొత్త ఓటరు నమోదు తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. పౌరుడు ఓటరుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌, నాయకులు కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌, చీకట్ల రాజు, సచిన్‌ తదితరులు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్‌ అధ్వర్యంలో వ్యాస రచన, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఆర్డీవో రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సువర్ణ, ఎంఈవో చందర్‌ గునిగెరి హన్మాండ్లు, వెంకట స్వామి, దౌలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నస్రుల్లాబాద్‌: మండల కేంద్రంలో గ్రామస్తులు శుక్రవారం బారడి పోచమ్మకు, పోలేరమ్మకు బోనాలను సమర్పించారు. బోనాలను ఊరేగించి పంటలు బాగా పండాలని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ కమిటీ సభ్యులు పెద్ద కాపు లింగం, మాజీ సర్పంచ్‌ అరిగె సాయిలు, బాన్సువాడ విఠల్‌, మేసీ్త్ర గంగారాం, తర్నం పోచయ్య, మహేందర్‌, హన్మాండ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నదని ఎల్లారెడ్డి బీజేపీ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి గంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన బీజేపీ నాయకుల సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్‌ పార్టీ ఎస్‌ఐఆర్‌పై చేస్తున్నవి అసత్యమైన పుకార్లని అన్నారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నవాటివి మాత్రమే తొలగించడం జరిగిందని దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకిషన్‌, దేవేందర్‌, రాజేశ్‌, కాశీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

గాంధారి: మండల పరిధిలోని చిన్న గుజ్జుల్‌ తండా శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఓ రైతు అమర్చిన తుంపర సేద్యం పైపులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల మొత్తం 25 పైపులు అమర్చగా అందులో 24 పైపులను దుండగులు రంపంతో కోసి ధ్వంసం చేసినట్లు బాధిత రైతు నేనావత్‌ మోహన్‌ తెలిపారు.

తాడ్వాయి: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రముఖ మోటివేటర్‌ సంజీవులు అన్నారు. మండలంలోని ఎండ్రియాల్‌ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్‌, టీచర్లకు సమావేశాన్ని ఏర్పాటు చేసి మోటీవేషన్‌ తరగులు నిర్వహించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపా ద్యాయుల సమన్వయం ఎంతో కృషిచేయాలన్నారు. సర్పంచ్‌ నర్సిములు, సింగిల్‌ విండో చైర్మన్లు సుధాకర్‌, వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ నర్సారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement