కామారెడ్డి టౌన్: నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల కర్తవ్యమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌ను పరిశీలించి, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలిక పెండింగ్, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని, జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలపై ‘జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలో జూదం, పేకాట నిర్మూలనకు 4 ప్రత్యేక బృందాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి, గట్టుమల్లు, ఉదయ్ భాస్కర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


