గాంధారి: ఎల్నినో ప్రభావంతో వచ్చే వేసవిలో గ్రామాల్లో తాగు సమస్యలు రాకుండా జీపీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేశ్వర్ అన్నారు. స్థానిక ఐకేపీ భవనంలో శుక్రవారం మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. వీబీజీరాంజీ పథకంలో భాగంగా గ్రామాల్లో నీటితొట్టెలు, నిర్మించుకోడానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. పశుగ్రాసం పెంచుకోవాలని సూచించారు. తహసీల్దార్ రేణుక చౌహాన్, అధికారులు, జీపీ కార్యాదర్శులు పాల్గొన్నారు.


