మహిళల సంక్షేమానికి పెద్ద పీట | - | Sakshi
Sakshi News home page

మహిళల సంక్షేమానికి పెద్ద పీట

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

మహిళల సంక్షేమానికి పెద్ద పీట

భిక్కనూరు: మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రామ సొసైటీ అధ్యక్షుడు బద్దం ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రామేశ్వర్‌పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణ స్లాబ్‌ పనులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్‌ గొల్లపల్లి వినోద్‌ కుమార్‌ గౌడ్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు మామిడి పద్మ, జీపీ కార్యదర్శి శ్యామ్‌, కాంట్రాక్టర్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement