తాడ్వాయి: పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి అన్నారు. మండల కేందలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మండల ఇన్చార్జి మర్రి బాలకిషన్ హాజరై అనుబంధు కమిటీలను ఎన్నుకున్నారు. యువమోర్చా అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా స్వామి రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రమేశ్, మహిళా మోర్చా అధ్యక్షులుగా వాణి, దళిత మోర్చా అధ్యక్షుడిగా శివయ్య, గిరిజన మోర్చా అధ్యక్షుడిగా సురేశ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా అబ్దుల్ రెహమాన్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, నాయకులు లింగారావు, గంగారెడ్డి, హోటల్ శ్రీను, వెంకట్రావు, నర్సింలు, దత్తాద్రి, రాజిరెడ్డి, బాలాజీ, ధర్మపురి, స్వామిరెడ్డి, కార్యకర్తలు పాలొన్నారు.


