లింగంపేట/ నస్రుల్లాబాద్: రైతులు భూసార పరిరక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని బాయంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా యాసంగి పంటలపై అవగాహన కల్పించారు. తక్కువ నీటితో పండె పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు చేసినప్పుడు దుకాణ డీలర్ల వద్ద తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. సర్పంచ్ సురేందర్, ఉపసర్పంచ్ అస్కుల సాయిలు, వ్యవసాయ విస్తీర్ణాధికారి షేక్ ఆమేర్, జీపీ కార్యదర్శి శ్రవంతి, రైతులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలం ఫకీరానాయక్ తండాలో రైతులకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. అనంతరం ఆయిల్ పాం సాగుకు ఆసక్తి ఉన్న రైతుల పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాములు, చందర్, రైతులు ఉన్నారు.


