నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ తండాలో శుక్రవారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ ఖాధ్వర్యంలో ఆయిల్ పాం మొక్కల పెంపకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానవన మండల అధికారి రామకృష్ణ మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పాం మొక్కలను నాటాలన్నారు. మండల వ్యవసాయ అధికారి భవాని, హిందుస్థాన్ యూనిలివర్ మేనేజర్ చంద్రబాబు, అంకోల్ క్యాంపు ఉప సర్పంచ్ రాము, సిబ్బంది వనోజ్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రశాంత్, కృష్ణమూర్తి, ఉమాకాంత్, రైతులు పాల్గొన్నారు.


