విశ్వశాంతి యజ్ఞం చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

విశ్వశాంతి యజ్ఞం చేపట్టాలి

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

విశ్వశాంతి యజ్ఞం చేపట్టాలి దుర్కిలో ఉచిత వైద్య శిబిరం నేడు శనేశ్వరునికి విశేష పూజలు ఘనంగా ధన్వంతరి జయంతి

భిక్కనూరు: కరువు కాటకాల నివారణకు గ్రామగ్రామాన విశ్వశాంతి యజ్ఞం నిర్వహించాలంటూ శ్రీరామ జపలిఖిత ప్రచారకులు కృష్ణానందస్వామి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో యజ్ఞాన్ని నిర్వహించేందుకు సర్పంచులు, అధికారులు సహకరించాలని ఆయన మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లి మండల సభలో కోరారు.

నస్రుల్లాబాద్‌: మండలంలోని దుర్కి గ్రామంలో లోటస్‌ ఆస్పత్రి బాన్సువాడ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నారాగౌడ్‌, కుమ్మరి నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ధన త్రయోదశి, మాస శివరాత్రి, ధన్వంతరి జయంతి సందర్భంగా శనివారం ఉదయం స్థానిక శ్రీవైద్యనాథ శ్రీశనేశ్వర ఆలయంలో విశేషపూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు లింగాగౌడ్‌, రవీందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తెలిపారు. శని దోష నివారణకు తెల్లవారుజాము నుంచి తైలాభిషేకం నిర్వహించవచ్చని వారు పేర్కొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ధన్వంతరి భగవాన్‌ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత ధన్వంతరి భగవాన్‌ జయంతిని పీఏంపీ, ఆర్‌ఏంపీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భగవాన్‌ విగ్రహం వద్ద వేదపండితులు గంగవరం ఆంజనేయశర్మ విశేషపూజలు చేశారు. జిల్లా ఆస్పత్రి వైద్యులతో పాటు అసోసియేషన్‌ అధికార ప్రతినిధి సీహెచ్‌ రాజయ్య, వర్కింగ్‌ అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి ఎల్‌ దేవయ్య, ఉపాధ్యక్షులు తుమ్మ శంకర్‌, కామారెడ్డి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎంబ ప్రకాశ్‌, శ్రీనివాస్‌, వైద్యులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో పీఎంపీ వైద్యులు శుక్రవారం ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఎంపీ వైద్యులు సాయిలు, రెడ్డి, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement