భిక్కనూరు/ నిజాంసాగర్/ కామారెడ్డి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతోందని భిక్కనూరు మండలం జంగంపల్లి సర్పంచ్ వాణివాసుయాదవ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో లబ్ధిదారులను నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. ల బ్ధిదారులకు కొత్త బట్టలు అందజేశారు. ఉప సర్పంచ్ ప్రకావ్ గౌడ్, జీపీ కార్యదర్శి దయాకర్‌రెడ్డి, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సత్యం, నాయకులు కార్తిక్, రవి, లింగం, రామస్వామి, నరసింహులు, బాలయ్య, భాను తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి జీపీలోని చెరువు ముందరి తండాలో లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రజా పండరి గృహ ప్రవేశం చేశారు. సర్పంచ్ బొజ్జ అంజయ్య, నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సర్పంచ్ భీమయాల లక్ష్మీరాజు భూమి పూజ చేశారు. అదేవిధంగా గ్రామంలోని 8వ వార్డులో వీబీజీరామ్‌జీ నిధుల కింద మంజూరైన రూ.2 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉప సర్పంచ్ కమ్మరి స్వప్న లక్ష్మీనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగొని లక్ష్మీ రాజగౌడ్, వడ్ల చంద్రకాంత్, గట్టగోని రామగౌడ్, కృష్ణాజీగారి ఆనంద్ రావు, కమ్మరి సిద్ధ రాములు, బత్తుల కిషన్, అన్మల గంగయ్య, వార్డు సభ్యులు కమ్మరి స్వామి, చంద్రశేఖర్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.
చెర్వుముందరి తండాలో గృహ ప్రవేశ ర చేస్తున్న నాయకులు
చిన్నమల్లారెడ్డిలో భూమి పూజ చేస్తున్న నాయకులు


