ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

సమయానికొచ్చింది నలుగురైదుగురే...

కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, గిరి, కలెక్టరేట్‌ పాలనాధికారి మసూర్‌ అహ్మద్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పౌల్ట్రీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను వదులుతుండడంతో చెరువు కలుషితం అవుతున్నదని భిక్కనూర్‌ మండలం కాచాపూర్‌ జీపీ పాలకవర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు వారు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఉప సర్పంచ్‌ దశరథం, స్ధానిక నాయకులు సంతోష్‌ గౌడ్‌, స్వామి, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. కొంతకాలంగా కేజేఎల్‌ పౌ ల్ట్రీ వారు వ్యర్థాల నిర్వహణను పాటించకుండా గ్రా మంలోని పెద్ద చెరువు లోకి వదులుతున్నారని తెలిపా రు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని రామారెడ్డి మండలం మోషంపూర్‌ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ ఫిర్యాదు చేశారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎలాంటి ఆస్తులు లేవన్నారు. గ్రామంలో ఆర్థిక, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌, కార్యదర్శులపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు సమయానికి చేరుకోవడం లేదు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ప్రజావాణి నిర్వహించే సమావేశ మందిరానికి చేరుకోగా.. అప్పుటికి నలుగురైదుగురు అధికారులు మాత్రమే వచ్చారు. వేదికపైకి వెళ్లిన కలెక్టర్‌.. ఏ అధికారి ఏ సమయానికి వస్తున్నారో గమనించారు. కొందరు పది నిమిషాలు, మరికొందరు ఇరవై నిమిషాలు, ఇంకొందరు అరగంట ఆలస్యంగా, మరికొందరు 11 గంటల తర్వాతా వచ్చారు. ఆలస్యంగా వచ్చిన అధికారులను ఒక్కొక్కరినీ పిలిపించి ఎందుకు ఆలస్యంగా వచ్చారో ప్రశ్నించారు. సమయపాలనపై కలెక్టర్‌ దృష్టి పెట్టడంతో అధికారుల్లో వణుకు మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement