చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

కామారెడ్డి రూరల్‌: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని కలెక్టర్‌ అశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. నర్సన్నపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో అదనంగా 2 మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులు, అభ్యంతరాలను నిర్ణీ త గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఆయన వెంట డీఈవో మల్లికార్జున్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్‌ హిమబిందు, ఎంపీడీవో హెప్సిబారాణి, ఎంఈవో ఎల్లయ్య, హెచ్‌ఎం శ్రీవాణి, ఏపీవో అన్నపూర్ణ, సర్పంచ్‌ రవి, ఉపసర్పంచ్‌ శేఖర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement