విశ్వకర్మ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

విశ్వకర్మ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి గ్రామాల అభివృద్ధిపై చొరవ చూపాలి మూడు లడ్డూలు.. రూ.4.05 లక్షలు జీజీహెచ్‌లో ఎక్స్‌రే సేవలు బంద్‌!

కామారెడ్డి అర్బన్‌: విశ్వకర్మ సమాజ అభివృద్ధి కోసం జాతీయ విశ్వకర్మ నైపుణ్య సంప్రదాయ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విశ్వకర్మ నాల్డెజ్‌ సెంటర్‌ వ్యవస్థాపకులు విశ్వనాథుల పుష్పగిరి డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో హైదరాబాద్‌లోని బోరుబండ విశ్వకర్మ ఆలయం నుంచి న్యూఢిల్లీ వరకు చేపట్టిన ఏక్తాయాత్ర మంగళవారం కామారెడ్డికి చేరుకుంది. కామారెడ్డి శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం అధిపతి శీర్లవంచ కృష్ణామాచార్యులు యాత్రకు స్వాగతం పలికారు. విశ్వకర్మల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ యాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామయ్యచారి, మహారాణి దీన్‌ విశ్వకర్మ, నరేష్‌చారి, రవిచారి, సత్తయ్యచారి, నరేందర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

మద్నూర్‌: గ్రామాల అభివృద్ధిపై కార్యదర్శులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జుక్కల్‌ నియోజకవర్గ ప్రత్యేకాధికారి, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్‌ సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మద్నూర్‌, డోంగ్లీ మండలాల గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఫాంపాండ్స్‌, ఇంకుడు గుంతలు, ఉపాధి హామీ పనుల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డోంగ్లీ మండల ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి రమ్య, ఎంపీడీవోలు జగదీశ్‌, సాయిలు, మండల పంచాయతీ అధికారి సత్యనారయణ, ఏపీవో పద్మ, కార్యదర్శులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని శ్రీసంకష్టహర మహాగణపతి ఆలయంలో మంగళవారం శ్రీసిద్ధిబుద్ధి సమేత స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 56 రకాల మిఠాయిలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి సంగీత కచేరి భక్తులను అలరించింది. కార్యక్రమంలో మహాగణపతి లడ్డూను వేలంగా వేయగా.. వసంత, మహిపాల్‌రెడ్డి దంపతులు రూ.1.55 లక్షలకు దక్కించుకున్నారు. సిద్ధి అమ్మవారి లడ్డూను భవాని మహిళా సేవా సమితి రూ.1.51 లక్షలకు, బుద్ధి అమ్మవారి లడ్డూను బాలరాజు దంపతులు రూ.లక్షకు పొందారు. అర్చకులు యజ్ఞం సంపత్‌కుమార్‌శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు అంజయ్య, రవీందర్‌గౌడ్‌, విశ్వనాథం, భవాని తదితరులు పాల్గొన్నారు.

మూలనపడ్డ ప్రధాన యంత్రం..

చెడిపోయిన మరో మొబైల్‌ యూనిట్‌

పట్టించుకోని వైద్యాధికారులు

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఎక్స్‌రే మిష న్లు పనిచేయడం లేదు. ఆస్పత్రిలోని ప్రధాన ఎక్స్‌రే యంత్రం కొద్దికాలం క్రితం మూలన ప డింది. రెండు నెలలుగా చిన్న మొబైల్‌ ఎక్స్‌రే యంత్రంతోనే నెట్టుకొస్తున్నారు. మంగళవా రం ఆ యంత్రం కూడా మొరాయించడంతో సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా అత్యవస ర చికిత్స కోసం వచ్చే క్షతగాత్రులు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్ర అస హనానికి గురైన రోగులు, వారి సహాయకులు రేడియాలజిస్ట్‌, ఆస్పత్రి వైద్యాధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు గత్యంతరం లేక అత్యవసర పరిస్థితిలో ప్రయివేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించారు. మరికొందరిని వైద్య కళాశాల సమీపంలోని ‘టి–హబ్‌’ సెంటర్‌కు రిఫర్‌ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి, ఎక్స్‌రే యంత్రాలకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement