భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కామారెడ్డి క్రైం: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. సోమవారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, పునర్వ్యవస్థీకరణ అంశాలపై సమీక్షించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, పరిహారం చెల్లింపు, నిర్వాసిత కుటుంబాలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర పునరావాస చర్యల పురోగతిని సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

గడువులోగా పరిష్కరించాలి

కామారెడ్డి క్రైం: సర్‌ ప్రక్రియలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సర్‌ ప్రక్రియపై జిల్లాలవారీగా సమీక్షించారు. ఓటరు నమోదు, పేర్ల తొలగింపు, వివరాల సవరణకు సంబంధించిన దరఖాస్తులపై అవసరమైన విచారణలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, డీఎఫ్‌వో నీరజ్‌, అదనపు కలెక్టర్‌ గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement