ఉద్యోగంలో చేరిన 13 నెలలకే.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగంలో చేరిన 13 నెలలకే..

Sep 22 2026 1:42 AM | Updated on Sep 22 2026 1:42 AM

ఉద్యోగంలో చేరిన 13 నెలలకే..

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన మున్సిపల్‌ ఉద్యోగి

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సైతం అరెస్ట్‌

నిజామాబాద్‌ అర్బన్‌: ఉద్యోగం చేరిన 13 నెలలకే లంచం తీసుకుంటూ మున్సిపల్‌ అధికారి ఏసీబీకి ప ట్టుబడ్డాడు. అదీ మాతృశాఖలో పని చేసి రిటైర్‌ అయి న ఉద్యోగి నుంచి డబ్బులు తీసుకుంటూ.. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో పదవీ విరమణ చేసింది. ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయంలోని ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ను ఆశ్రయించింది. పని కావాలంటే ముందుగా డబ్బులు ఇవ్వాలని ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ అశోక్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కిరణ్‌కుమార్‌ రూ.35వేలు డిమాండ్‌ చే శారు. ముందుగా రూ.15 వేలు ఇవ్వాలన్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారంబాధితురాలి కుమారుడు సీతారాంనగర్‌ కాలనీ పద్మశాలి సంఘం వద్ద ఇద్దరు ఉద్యోగులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకువచ్చి విచారించారు. మున్సిపల్‌ కార్యాలయంలో పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌గా పనిచేసి మరణించిన అమ్మాయి కుమారుడు అశోక్‌ కారుణ్య నియామకం కింద 13 నెలల క్రితం ఉద్యోగం చేరాడు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలలకే లంచం డిమాండ్‌ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement