పిట్లం : బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశానికి దిక్సూచి అని సామాజిక కార్యకర్త, దళితరత్న అయ్యాల సంతోష్ పేర్కొన్నారు. ఆయన మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు బుధవారం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామస్తులకు విద్యా ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్తులు అయ్యాల సంతోష్‌ను శాలువాతో సన్మానించారు. సర్పంచ్ సునీత, దావులయ్య, అంబేడ్కర్ సంఘం ప్రెసిడెంట్ పోచయ్య, సంజీవులు, బస్వారాజు, అనిల్, లక్ష్మణ్, రమేష్, నర్సింలు, రాములు, సామియెల్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట/బాన్సువాడ రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్ అన్నారు. వనమహోత్సవంలో భాగంగా బుధవారం గ్రామంలో మొక్కలు నాటారు. ఇబ్రహీంపేట్ సర్పంచ్ సంధ్య రాజ్‌కుమార్ గ్రామంలో మొక్కలు నా టారు. ఉపసర్పంచ్ పాత స్వామి, వార్డు స భ్యులు, కార్యదర్శి పండరి, తదితరులున్నారు.
దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్: దోమకొండ జీపీ కార్యాలయంలో బుధవారాం లబ్ధిదారులకు స్మార్ట్‌రేషన్ కార్డులను సర్పంచ్ ఐరేని నర్సయ్య పంపిణీ చేశారు. అలాగే ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ అయ్యల సాయిలు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌లు బొమ్మెర శ్రీనివాస్, పంతుల మహేందర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తిరుమల గౌడ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.
భిక్కనూరు: భాగిర్తిపల్లి మాజీ సర్పంచ్ పల్లెర్ల శ్రీనివా్‌స్ గుప్తా (70) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుమరుడు పెద్దమల్లారెడ్డి విండో మాజీ చైర్మన్ సంతోష్ గుప్తా గతనెల 11వ తేదిన మృతి చెందాడు. 38 రోజుల్లోనే తండ్రి కుమారుడు మరణించారు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుకు గురై మరణించాడని గ్రామస్తులు తెలిపారు.


