భిక్కనూరు: ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తిగా భ్రమలు తొలగిపోయాయని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు, కాంగ్రెస్ నాయకురాలు ఏనుగు సుజాతతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతోషురెడ్డి, ఎల్లయ్య, పెద్దమ్మ, లక్ష్మయ్య, సింగిరెడ్డి చిన్న భూపతిరెడ్డి, లక్ష్మితో పాటు మరో 22 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారంబీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలు అత్తెల్లి శ్రీనివాస్, గంగారెడ్డి, నీలంరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.


