కామారెడ్డి టౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు అడ్లూర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ము న్సిపల్ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, అంజాద్, నిట్టు గంగాధర్, నాయకులు కాళ్ల గణేష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. లబ్ధిదారులకు ఆయన వస్త్రాలను బహూకరించారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, సర్పంచ్ రాణి రాజు, వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్ వినోద్‌కుమార్‌గౌడ్, నేతలు రమేష్, బాపురెడ్డి, రాజేందర్‌లు పాల్గొన్నారు.


