పేదల సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల సాకారం

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

● పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి

● పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

భిక్కనూరు/ దోమకొండ/ లింగంపేట/ నాగిరెడ్డిపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని పలువురు కాంగ్రెస్‌ నేతలు అన్నారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. పార్టీలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొడురి సాయాగౌడ్‌, తిప్పాపూర్‌ విండో చైర్మన్‌ భీంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

దోమకొండ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నాగారపు రమ్య, నిమ్మ అర్చన, నర్రాగుల మానెవ్వ, కొడిప్యాక నిరంజన్‌గౌడ్‌లు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేశారు. వీరికి డీసీసీ అధ్యక్షుడు, దోమకొండ సర్పంచ్‌ ఐరేని నర్సయ్య దుస్తులు అందజేశారు. దోమకొండలో 161 మందికి ఇళ్లు మంజూరు కాగా 80 మంది గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తీగల తిర్మల్‌గౌడ్‌, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కదిరి గోపాల్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాములు, నర్సింలు, బాలరాజు, నాయకులు సుధాకర్‌, సిద్ధరాములు, నయీం, సంతోష్‌, రాజయ్య, ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట మండలం నల్లమడుగు గ్రమంలో సర్పంచ్‌ తహసీన్‌బేగం ఇందిరమ్మ ఇళ్లకు మార్కౌట్‌ ఇచ్చారు. గ్రామానికి చెందిన ఫకృన్నీస్సాబేగం, కాజాబాను, నఫీస్‌, సాయవ్వ, బాలమణి, హైమదిలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు.

నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్‌ నార్ల గంగామ ణి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సూరయ్య, జీపీ కార్యదర్శి కిష్టయ్య, నాయకులు మల్లేశం, పసులాది కిష్టయ్య, దివిటీ కిష్టయ్య, మోహన్‌, బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement