ఆర్మూర్‌టౌన్: హెడ్ కానిస్టేబుల్ తలారి తిరుపతి ఇటీవల ఆకస్మికంగా గుండెపోటుతో మృతిచెంద గా,బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు.పట్టణానికి చెందిన తిరుప తి ఆర్మూర్ ఏసీపీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం నిర్వహించిన అంత్యక్రియలకు సీపీ హా జరై, నివాళ్లు అర్పించారు. మృతుడి కుటుంబ స భ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరో సా కల్పించారు. ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయబాబు, రెంజల్ ఎస్సై గంగాధర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకిల్ పాషా పాల్గొన్నారు.


