పిట్లం:మండలంలోని బుర్నా పూర్ గ్రామానికి చెందిన ప్ర మోద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో 92 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఆంత్రోపాలజీ కోర్సులో సీటు సాధించి కామారెడ్డి జిల్లా బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సా హంతోనే ఈ ఘటన సాధించానని పేర్కొన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం నూతన విభాగాధిపతిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐలేని మహేందర్ నియమితులయ్యారు. వీసీ యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి బుధవారం మహేందర్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు.


