నాగిరెడ్డిపేట/ కామారెడ్డి రూరల్: ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని టీఎస్ సీపీఎస్‌ఈయూ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 23న హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను టీఎస్ సీపీఎస్‌ఈయూ నాయకులు బుధవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకట్‌రెడ్డి, యూనియన్ మండల అధ్యక్షుడు సబాత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి అరుణ్, సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో టీఎస్‌సీపీఎస్‌ఈయూ నాయకులు ఈ నెల 23న చేపట్టిన చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం సాయిరెడ్డి, స్వామి, సంగయ్య, బాబయ్య, అనిల్, రమేశ్, ప్రశాంత్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


