లింగంపేట(ఎల్లారెడ్డి): భార్యపై కత్తితో దాడి చేసిన భర్తని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సమక్షంలో రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన వడ్ల మౌనికపై తన భర్త శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన బహుగుణచారి సో మవారం అర్ధరాత్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గా యపర్చిన విషయం విధితమే. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. తన భార్య మెడలో ఉన్న బంగారం కోసం చంపాలనే ఉద్దేశంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.


