నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని లబ్ధిదారులకు ఎంపీడీవో శ్రీనివాస్ సూచించారు. జుక్క ల్ మండలం హంగర్గ గ్రామంలో ఇందిరమ్మ ఇ ళ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలకు విడతల వారిగా బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీవో రాము,జీపీ కార్యదర్శి ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అవుట్‌సోర్సింగ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ డిమాండ్ చేశారు. విజయ డెయిరీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు 16 మంది బుధవారం అవుట్‌సోర్సింగ్ జేఏసీ సభ్యత్వం తీసుకున్నారు. అవుట్‌సోర్సింగ్ వ్యవస్థ రద్దు కోసం చేస్తున్న పోరాటానికి అందరూ సహకారం అందించాలని కోరారు. జేఏసీ ప్రతినిధులు మోహెర్‌దీప్, శ్రీకాంత్, సంతోష్, అఫ్రోజ్, మధుసూదన్, సంజీవ్ తదితరులు ఉన్నారు.
పోలింగ్ బూత్
కేటాయింపుపై హర్షం
మద్నూర్(జుక్కల్): మండలంలోని సలాబత్‌పూర్‌లో పోలింగ్ బూత్ కేటాయింపుపై గ్రామ స్తులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. గ్రా మంలో పోలింగ్ బూత్ లేకపోవడంతో పక్క గ్రా మానికి వెళ్లి ఎన్నో ఇబ్బందులు పడ్డామని ప్రస్తుతం తమ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన మద్నూర్ తహసీల్దార్ ముజీబ్‌కు గ్రామస్తులు శాలువాతో సన్మానించి మి ఠాయి తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు హ న్మాండ్లు, బీజేపీ బూత్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, యోగేశ్, ఖయ్యుం, అంకిత్‌పటేల్ ఉన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
బోధన్‌రూరల్: సాలూర బైపాస్ రోడ్డు వద్ద అ క్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపా రు. సాలూర బైపాస్ వద్ద బుధవారం పోలీసు లు వాహనాల తనిఖీ చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. సాలూ రకు చెందిన రాజేశ్వర్ సుమారు 9.8 క్వింటాళ్ల బియ్యంను తరలిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించి, వారి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


