కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 220 కిలోల నల్లబెల్లం, 64 కిలోల పటిక పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి. నాటు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక లను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో కామారెడ్డి ఎకై ్సజ్ అధికారులు గురువారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్‌లో వాహనాల తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం వీర్నపల్లి గ్రామానికి చెందిన భుక్యా గంగా అనే వ్యక్తి కారులో తరలిస్తున్న 60 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను స్వాధీనం చేసున్నారు. అనంతరం భుక్యా గంగా వాంగ్మూలం మేరకు పట్టణంలోని గంజి మార్కెట్ యార్డులో ఉన్న కృష్ణకుమార్ మర్చంట్ దుకాణంలో సోదాలు జరిపారు. అక్కడ మరో 160 కిలోల నల్లబెల్లం, 54 కిలోల పటిక లభ్యమైనట్లు ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. నల్లబెల్లం, పటిక లను స్వాధీనం చేసుకుని భుక్యా గంగాతో పాటు దుకాణ యజమాని కృష్ణకుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


