పెట్టుబడా మోసం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడా మోసం

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

పెట్టుబడా మోసం

న్యూస్‌రీల్‌

గతేడాది 980 ఫిర్యాదులు..

శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

ఉపాధి కోసం దుబాయి వెళ్లొచ్చిన రామారెడ్డి మండలం రమణతండాకు చెందిన భుక్యా నవీన్‌ తాను పనిచేసిన ఓ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీతో కుమ్మకై ్క అధిక లాభాలను ఆశచూపి కామారెడ్డితోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన 7,636 మందితో రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిలో ఇద్దరిని గత నెల 31న, మరో నిందితుడిని నాలుగు రోజుల క్రితం పోలీసులు రిమాండ్‌కు పంపారు.

సైబర్‌ నేరాలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో గతేడాది మొత్తం 980 ఫిర్యాదులు రాగా, వాటిలో విచారణ పూర్తయిన తర్వాత 160 కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో రూ.5.83 కోట్లను బాధితులు నష్టపోయారు. వాటి నుంచి రూ.1.07 కోట్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 400లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయితే, సైబర్‌ నేరాలను ప్రధాన సమస్యగా భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాయి. సైబర్‌ వారియర్‌ పేరిట ప్రతి పీఎస్‌లో ఒక అధికారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, బాధ్యతలు అప్పగించడంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోలీసు కళాబృందాల ఆధ్వర్యంలో బ్యాంకులు, బస్టాండ్‌లు, పాఠశాలలు, కళాశాలల్లో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఫ్రాంచైజీ, ఉద్యోగాల పేరిట

అమాయకులకు గాలం

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు

400కు పైగా ఫిర్యాదులు

అప్రమత్తంగా ఉండాలని

పోలీసుల సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement